యాభై రోజుల్లో దేవర దండయాత్ర..!

Thursday, September 19, 2024

ఈరోజు నుంచి సరిగ్గా యాభై రోజుల్లో బాక్సాఫీస్ పై దేవర దండయాత్ర చేయబోతున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్‌ 27నెంతో గ్రాండ్‌ గా థియేటర్లలోకి రాబోతోంది. దీంతో.. సోషల్ మీడియాలో నందమూరి అభిమానులు కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. మరోవైపు.. మూవీ మేకర్స్ కూడా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే సినిమా నుంచి గ్లింప్స్ విడుదల చేయగా.. బ్లడ్ మూన్ షాట్‌తో పండగ చేసుకున్నారు అభిమానులు. ఇక అనిరుధ్ ఇచ్చిన ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్‌తో సోషల్ మీడియాను చిత్ర బృందం షేక్‌ చేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం దేవర సెకండ్ సింగిల్‌తో రచ్చ చేస్తున్నారు. రీసెంట్‌గా విడుదల అయిన చుట్టమల్లే సాంగ్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. 24 గంటల్లో 33 మిలియన్స్ వ్యూస్ రాబట్టిన ఈ పాట.. ఇప్పటి వరకు యూట్యూబ్‌లో 50 మిలియన్స్ ని క్రాస్ చేసింది.అయితే.. ఇంత రెస్పాన్స్ వస్తున్న సాంగ్‌కి ట్రోలింగ్ కూడా అదే రేంజ్‌లో జరుగుతోంది. ఇది శ్రీలంకన్ మ్యూజిషియన్ కంపోజ్ చేసిన సాంగ్‌ను పోలి ఉందని.. ట్రోలర్స్ రెండు వీడియోలను పోలుస్తూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. కానీ.. మేకర్స్‌తో పాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఇవేమి పట్టించుకోకుండా.. సాంగ్‌ను లూప్‌ మోడ్‌లో వింటూ  తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ పాటలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ వేసిన స్టెప్పులతో చేసిన రీల్స్, కవర్ సాంగ్స్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. దీంతో.. దేవర పై అంచనాలు ఇంకా పెరుగుతునే ఉన్నాయి. ఇక ఈ సినిమాను కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో దేవర చేసే మృగాల వేట మామూలుగా ఉండదని సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి కూడా చెబుతునే ఉన్నాడు. మరి.. దేవర ఏం చేస్తాడో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles