ఓటీటీలోకి దేవర..ఎప్పుడో తెలుసా!

Wednesday, January 22, 2025

యంగ్‌ టైగర్‌ , మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా “దేవర” . మరి తారక్ మూవీ కెరీర్ లో ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన సూపర్ సింగిల్‌ సినిమా ఇది.  కాగా మిక్స్డ్ టాక్ తో కూడా 500 కోట్లకి పైగా భారీ గ్రాస్ ని కొల్లగొట్టి ముందుకు దూసుకుపోతుంది.

అయితే ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం చాలా రోజులు నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఫైనల్ గా దీనిపై ఇపుడు అయితే ఓ అదిరిపోయే క్లారిటీ అయితే వచ్చింది. ఇన్ని రోజులు దేవర సినిమా నవంబర్ 8 నుంచే స్ట్రీమింగ్ కి రానుందని అని టాక్ ఉంది. ఇక అది నిజం చేస్తూ దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ నుంచి ఓ క్లారిటీ వచ్చేసింది.

నెట్ ఫ్లిక్స్ లో దేవర ఈ నవంబర్ 8 నుంచి అందుబాటులో ఉండనున్నట్టుగా తెలిపారు. సో దేవర ఆగమనం ఈ 8 నుంచే అని సమాచారం. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles