దేవర ఫియర్ సాంగ్‌ ప్రొమో అదిరిందంతే!

Tuesday, January 21, 2025

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న భారీ బడ్జెట్‌ సినిమా దేవర. ఈ సినిమా మాస్‌ అండ్‌ యాక్షన్‌ డైరెక్టర్‌ కొరటాల శివ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా బజ్‌ ను క్రియేట్‌ చేసింది. ఈ సినిమాలో బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రతినాయక ఛాయలు ఉన్న క్యారెక్టర్‌ చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

ఈ సినిమా రెండు పార్టులుగా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమా మొదటి భాగం శరవేగంగా జరుపుకుంటుంది. దేవర చిత్రం అక్టోబర్‌ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళంలో చిత్రాన్ని అత్యంత భారీగా విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ప్రమోషన్స్ లో భాగం ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను ఎన్టీఆర్ పుట్టినరోజున విడుదల చేస్తున్నారు.

సరిగ్గా రెండే రోజులు ఉండడంతో ఇప్పుడు ఆ పాట కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఎలాంటి లిరిక్స్ లేకుండా మొత్తం బీజీతో వణికించేలా ఉన్న ఆ ప్రోమో చూస్తుంటే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఏదో పెద్ద ప్లానే చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఇక ఇండియన్‌ సినిమాలో మైల్‌స్టోన్‌ మార్క్ దేవర క్రియేట్‌ చేస్తుందనే అంటున్నారు చిత్ర బృందం.  ఇప్పటికే విడుదలైన దేవర గ్లింప్స్ సోషల్‌ మీడియాలో సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేసింది. ఎన్టీఆర్‌ రోల్‌ మీద భీభత్సమైన ఇంట్రస్ట్ క్రియేట్‌ చేసింది. పాన్‌ ఇండియా లెవల్లో అద్భుతమైన క్రేజ్‌ తెచ్చుకున్న దేవర చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌ రామ్‌ సమర్పిస్తున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles