మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత సంవత్సరం థియేటర్లలో విడుదలై మంచి హిట్ అందుకున్న ఈ సినిమా, నేటితో తన ప్రయాణంలో ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దేవర వార్షికోత్సవాన్ని అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేస్తున్నారు. సినిమా యూనిట్ కూడా ఈ వేడుకలో భాగమైంది.
ఇక దేవరకి సీక్వెల్ రూపంలో దేవర 2 వస్తోందన్న వార్త ముందే తెలిసిన విషయమే. ఇప్పుడు ఏడాది పూర్తి అయిన సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా మార్చేందుకు, తారక్ లుక్ తో కొత్త పోస్టర్ రిలీజ్ చేసి దేవర 2 కోసం రెడీ అవ్వాలని సూచించారు. ఈ రెండో భాగంలో వర స్టోరీ కీలకంగా ఉంటుందని అప్పటికే క్లారిటీ ఇచ్చారు. టైటిల్ లో కూడా “దేవర” పేరుని స్పెషల్‌గా చూపించి, బ్యాక్‌డ్రాప్ లో పార్ట్ 2ని హైలైట్ చేశారు.
అందువల్ల దేవర 2 చాలా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుందని చెప్పొచ్చు.
