విశ్వంభరలో ఈ సీన్‌ విధ్వంసం!

Wednesday, December 25, 2024

లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అందాల భామ  త్రిష హీరోయిన్ గా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ సినిమా “విశ్వంభర” గురించి అందరికీ తెలిసిందే.  చాలా కాలం తర్వాత చిరు నుంచి వస్తున్నా స్ట్రైట్ అండ్ విజువల్ వండర్ సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.

మరి రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి ఫ్యాన్స్ లో సాలిడ్ రెస్పాన్స్ రాగా ఇప్పుడు ఈ సినిమా క్రేజీ సీక్వెన్స్ సంబంధించి ఓ క్రేజీ అప్డేట్‌ వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ సినిమాలో చిరంజీవిపై రెక్కల గుర్రంతో సీక్వెన్స్ ఉంటుందని సమాచారం. ఇది ఫ్యాన్స్ కి ఓ రేంజ్ లో ట్రీట్ ఇస్తుంది అని ఆ ఎపిసోడ్ ని వశిష్ట క్రేజీ లెవెల్లో డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది.

మరి ఇలా మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్న భారీ ట్రీట్ ఈ సినిమా తోనే నెరవేరేలా ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, సురభి పురాణిక్ తదితరులు నటిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles