దేసీ రాజ్ మాస్‌ గ్లింప్స్!

Wednesday, January 15, 2025

టాలీవుడ్‌ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి నటిస్తున్న తాజా సినిమా ‘ఘాటి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు పెంచేసింది. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై ఇంకా మంచి బజ్ ఏర్పడింది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచాయి. తాజాగా ఈ సినిమాలో దేసీ రాజు అనే పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.

ఘాటి వరల్డ్‌లో రెబల్‌గా దేసీ రాజు ప్రయాణం ఉండబోతుందని.. ఇది ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని ఈ గ్లింప్స్ ద్వారా ప్రేక్షకులకు మూవీ టీమ్‌ తెలిపింది. ఈ సినిమాలో దేసీ రాజు పాత్రలో తమిళ నటుడు విక్రమ్ ప్రభు నటిస్తున్నాడు. ఇది ఆయనకు తెలుగులో తొలి స్ట్రెయిట్ మూవీ అనే చెప్పుకోవాలి. ఇక ఈ సినిమాలో అనుష్కకు సాయం చేసే పాత్రలో దేసీ రాజు కనిపించబోతున్నాడని ఈ గ్లింప్స్ చూస్తే తెలుస్తుంది.

ఈ సినిమాలో అనుష్క పాత్ర కూడా చాలా మాస్‌గా ఉండబోతుందని ఇప్పటికే ఈ మూవీ టీజర్ చూస్తే అర్థం అయిపోతుంది. మరి ఈ సినిమాలో దేసీ రాజు పాత్ర ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles