దీపికాకి స్టార్ డైరెక్టర్‌ సపోర్ట్!

Thursday, December 4, 2025

బాలీవుడ్‌ టాప్ హీరోయిన్‌ దీపికా పదుకోణ్‌ ఇటీవలే ఓ పెద్ద ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్న విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇది ఎవరి సినిమా అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఉంది.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ అనే భారీ చిత్రమే ఆ ప్రాజెక్ట్‌. అయితే దీపికా తప్పుకోవడం వెనుక పలు కారణాలు ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందించారు కానీ, తాజాగా దర్శక దిగ్గజం మణిరత్నం ఇచ్చిన కామెంట్స్ మాత్రం ఇప్పుడు ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

మణిరత్నం మాట్లాడుతూ.. దీపికా తీసుకున్న నిర్ణయం తాను సమర్థిస్తున్నానని చెప్పడం ఇండస్ట్రీలో వైరల్‌గా మారింది. ఓ నటిగా ఆమెకి కొన్ని నియమాలు ఉండొచ్చు, కొన్ని అభిప్రాయాలు ఉండొచ్చు.. ఆ విషయాల్లో ఆమె తీసుకునే నిర్ణయం సరైనదేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక ఆర్టిస్ట్‌ షూటింగ్‌కు ఎంత సమయం కేటాయించాలో, ఎంత రెమ్యునరేషన్ కోరాలో అన్నది పూర్తిగా వారి ఇష్టం అని మణిరత్నం స్పష్టం చేశారు. దీపికా తనకు అనుకూలంగా అనిపించిన నిర్ణయం తీసుకుంది అంతే తప్ప ఇందులో తప్పేమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉంటే.. మణిరత్నం డైరెక్షన్‌లో తెరకెక్కిన మరో భారీ చిత్రం ‘థగ్ లైఫ్’ జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇప్పటికే మంచి అంచనాలు పెంచుకుంది. దీపికా విషయంలో మణిరత్నం స్పందించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు మారింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles