దటీజ్‌ ప్రభాస్‌!

Saturday, January 18, 2025

తెలుగు నుంచి మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన నటుడు యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్‌. ఈ యంగ్‌ రెబల్‌ స్టార్ ఇప్పుడు అంతకుమించిన సినిమాలు చేస్తున్నాడు. వేల కోట్ల కలెక్షన్లు కొల్లగొడుతున్నాయి. ఇప్పుడు ఆయన సినిమా హిట్టా? ప్లాపా? అనేది పక్కన పెడితే సినిమాలకు బిజినెస్ తో పాటు కలెక్షన్స్ కూడా వేల కోట్లలోనే వసూలు అవుతున్నాయి. వేల కోట్లు అంటే ఒక్కొక్క సినిమాకి వేల కోట్లు కాదు ఆయన చేస్తున్న సినిమాలు కలిపి వేల కోట్లు మార్కెట్తో పాటు కలెక్షన్స్ కూడా వస్తున్నాయి.

ఒక పక్క ఇండియాలో ఉన్న మార్కెట్ తో పాటు నార్త్ అమెరికాలో ప్రభాస్ ఒక స్ట్రాంగ్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. నార్త్ అమెరికా రికార్డ్స్ విషయంలో ప్రభాస్ ఒక సరికొత్త రికార్డుని  తన పేరు మీద క్రియేట్ చేసుకున్నాడు. అదేంటంటే ఇప్పటివరకు ఏ ఇండియన్ హీరోకి లేనివిధంగా ఆయన నార్త్ అమెరికాలో  రెండు 18 మిలియన్ డాలర్ల గ్రాస్ సినిమాలు అక్కడ రికార్డులు క్రియేట్‌ చేసినట్లు సమాచారం. అంతేకాదు ఆయన చివరి రెండు సినిమాలు కలిపితే 27 మిలియన్ డాలర్లకు పైగానే నార్త్ అమెరికాలో కలెక్షన్స్ వసూలు అయ్యాయి.

సలార్ సినిమాకి 9 మిలియన్ డాలర్లు వస్తే కల్కి సినిమాకి మాత్రం 18 1/2 మిలియన్ డాలర్లు వచ్చాయి. ఆ రెండు కలిపి దాదాపు 27 మిలియన్ల డాలర్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ కలెక్షన్లను దృష్టిలో పెట్టుకుని రాబోయే సినిమాలకు భారీ రేటు పెట్టి అక్కడి రైట్స్ కొనుగోలు చేసేందుకు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు రెడీ అవుతున్నారు. రాజా సాబ్ సినిమాకి డిస్ట్రిబ్యూటర్లు షాకింగ్ రేట్లు పెట్టేస్తున్నారు

అలాగే రాబోయే మిగతా ప్రభాస్ సినిమాలకు కూడా దాదాపుగా అదే క్రేజ్ ఉంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు కేవలం ఓవర్సీస్ మీదనే 80 కోట్ల వరకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. కానీ నిర్మాతలు మాత్రం 100 కోట్లు అక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక ఇండియన్ స్టార్ హీరోకి ఇది భారీ రికార్డు అనే చెప్పాలి. దీంతో ప్రభాస్ అభిమానులు కాలర్ ఎగరేసుకునే న్యూస్ ఇదే అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles