దటీజ్ నాగార్జున…అభిమానికి క్షమాపణలు చెప్పి..ఫోటో దిగి!

Wednesday, January 22, 2025

టాలీవుడ్‌ సీనియర్‌ హీరో కింగ్‌ నాగార్జున రీసెంట్‌ గా ఓ అభిమానికి క్షమాపణ చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన రెండు రోజుల క్రితం ముంబై ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు వస్తుండగా  నాగార్జునను చూసిన ఓ అభిమాని.. ఆయన్ని కలిసేందుకు ముందుకు వచ్చాడు. దాంతో సెక్యూరిటీ సిబ్బంది ఒకతను ఆయనను పక్కకు లాగేశాడు.

దీంతో ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తి ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు చేశాడు. ఈ వీడియో చూసిన నాగార్జున తన ట్విట్టర్ వేదికగా స్పందింస్తూ ఆ అభిమానికి క్షమాపణలు తెలియజేశాడు. తాజాగా నాగార్జున ఆ అభిమానిని గుర్తుపట్టి మరీ  అతన్ని కలిసి ఫోటో దిగాడు. నాగార్జున ప్రస్తుతం ‘కుబేర’ షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతుంది.

ఈ క్రమంలోనే  ఆయన ముంబయి ఎయిర్‌పోర్ట్ నుంచి హైద‌రాబాద్ తిరిగి వ‌స్తుండ‌గా ఆ అభిమానిని క‌లుసుకున్నాడు. ఇక నాగార్జున‌ను క‌లిసిన ఆనందంలో ఆ అభిమాని బోకే గిప్ట్‌గా ఇచ్చాడు. ఆ బొకే అందిస్తూ నాగ్ కి సారీ అని చెబితే..’ సారీ ఎందుకు, అందులో నీ తప్పేం లేదు.. అంటూ అభిమానిని దగ్గర తీసుకున్నాడు. దాంతో ఆ అభిమాని చాలా హ్యాపీ ఫీలయ్యాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్స్ కింగ్‌ ఎప్పటికీ కింగే అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles