దబిడి..దబిడి..వచ్చేసిందోచ్‌!

Saturday, January 4, 2025

దబిడి..దబిడి..వచ్చేసిందోచ్‌! నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా సినిమా ‘డాకు మహారాజ్’ సంక్రాంతి కానుకగా గ్రాండ్ విడుదలకు సిద్దమయ్యింది. ఈ సినిమాను డైరెక్టర్‌ బాబీ తెరకెక్కిస్తుండడంతో ఈ మూవీపై అంచనాలు వేరే రేంజ్‌ లో క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అయితే, తాజాగా ఈ సినిమా నుంచి ‘దబిడి దిబిడి’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు.

థమన్ అందించిన క్యాచీ ట్యూన్‌కి బాలయ్య తనదైన శైలిలో స్టెప్పులు వేసి ఇరగదీశాడు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా బాలయ్యతో కలిసి ఈ పాటలో చిందులు వేసింది. వీరిద్దరి కాంబో రిఫ్రెషింగ్‌గా ఉండటంతో ఈ పాట అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, బాబీ డియోల్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

https://youtu.be/ARGbxFY9McA?si=fby1F7EpfMRpYkpM

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles