ఏడిపిస్తున్న గోపిచంద్‌!

Sunday, December 22, 2024

మ్యాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబోలో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా ‘విశ్వం’. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మింస్తుండగా.. దోనేపూడి చక్రపాణి సమర్పిస్తున్నారు. ఈ చిత్రం నుంచి రీసెంట్‌గా విడుదలైన టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్‌తో సినిమాపై భారీ అంచనాలు పెంచింది.

 అంతే కాకుండా ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘మొరాకో మగువా’కు ట్రెమండస్ రెస్పాన్స్ రాగా.. ఈ రోజు మేకర్స్ సెకెండ్ సింగిల్ ‘మొండి తల్లి పిల్ల నువ్వు’ సాంగ్‌ని విడుదల చేశారు.’అడుగే తడబడితే.. ఇదిగో.. నీ వెనకే ఉంటానులే.. చిన్నారి తల్లి! కలకో భయపడకు.. ఎపుడూ.. నీ కునుకై ఉంటానులే.. చిన్నారి తల్లి! మొండి తల్లి పిల్ల నువ్వు’ అంటూ లిరిసిస్ట్‌  శ్రీ హర్ష ఈమని రాసిన లిరిక్స్ మనసుని ఆకట్టుకుంటున్నాయి.

మదర్, డాటర్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన ఈ సెకండ్ సింగిల్ కథలోని ఎమోషనల్ డెప్త్‌ని తెలియజేస్తోంది. ఈ పాటలో పాప, గోపిచంద్ మధ్య ఉండే ఎమోషన్ చాలా క్యురియాసిటీని పెంచింది. కాగా.. ఇందులో కావ్య థాపర్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించనుండగా.. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 11న గ్రాండ్‌గా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles