నితిన్‌ తరువాత సినిమా పై క్రేజీ అప్డేట్‌

Tuesday, March 25, 2025

హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రాబిన్‌హుడ్’ ఈ నెల 28న గ్రాండ్ విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత నితిన్ నటించిన ‘తమ్ముడు’ చిత్రం కూడా వేసవి కానుకగా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఆ మూవీ షూటింగ్ ముగిసింది. అయితే, ఇప్పుడు నితిన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది.

నితిన్ తన నెక్స్ట్ చిత్రంగా ఓ స్పోర్ట్స్ డ్రామాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇష్క్ మూవీ డైరెక్టర్‌  విక్రమ్ కె కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను ఈ ఏడాది చివరినాటికి తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles