డాకు మహారాజ్‌ పై క్రేజీ అప్డేట్‌!

Saturday, January 18, 2025

నందమూరి నటసింహం బాలయ్య – దర్శకుడు బాబీ కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నసినిమా “డాకు మహారాజ్”.    ఈ మూవీ  నుంచి వచ్చిన సాలిడ్ టైటిల్ టీజర్ అద్భుతంగా ఆకట్టుకుంది. అయితే , తాజాగా ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ పై ఓ క్రేజీ రూమర్ బయటకు వచ్చింది. ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో బాలయ్య కొత్త లుక్ లో చేసే యాక్షన్ వెరీ పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది. అలాగే, ఈ యాక్షన్ సీక్వెన్స్ లో బాలయ్య పై వచ్చే ఫైట్స్ కూడా చాలా స్టైలిష్ గా ఉంటుందని తెలుస్తోంది.

“డాకు మహారాజ్” సినిమా మొత్తంలోనే మెయిన్ హైలైట్స్ లో ఈ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్సే హైలైట్ గా ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి ఈ మూవీ కచ్చితంగా బాలయ్య ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చేలా దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారట. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్‌ ఫోర్ సినిమాపై సాయి సౌజన్య ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చాందినీ చౌదరి, ఊర్వశీ రౌతేలా ఈ సినిమాలో ముఖ్య  పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తుండగా బాబీ డియోల్ మరో కీలక పాత్రలో యాక్ట్‌ చేస్తున్నాడు.

ReplyForwardAdd reaction

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles