భారతీయుడు 2 ట్రైలర్‌ పై క్రేజీ అప్డేట్‌!

Tuesday, January 21, 2025

కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్ డైరెక్షన్‌ లో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘భారతీయుడు-2’. ఈ సినిమా ట్రైలర్ ఈనెల 25న విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా ట్రైలర్ గురించి లేటెస్ట్ అప్ డేట్ వినిపిస్తోంది. ట్రైలర్ లో కమల్‌ యాక్షన్ అదిరిందని.. ముఖ్యంగా కమల్ హాసన్ లుక్స్,  డైలాగ్స్ చాలా బాగున్నాయని అని సమాచారం. కాగా జులై 12, 2024న ఈ సినిమా విడుదల కాబోతుంది.

కాగా ఈ సినిమాకి లైకా ప్రొడక్షన్స్, రెడీ జెయింట్ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తుండగా, రవివర్మన్‌ ఛాయాగ్రాహకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో కాజల్ , రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా, SJ సూర్య, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని ,  బ్రహ్మానందం కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles