పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజి’ చుట్టూ అద్భుతమైన హంగామా కొనసాగుతోంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా కోసం ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ ఇందులో కనిపించే యాక్షన్, స్టైలిష్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా మారనున్నాయన్న నమ్మకాన్ని చిత్ర బృందం వ్యక్తం చేస్తోంది.
ఈ సినిమాకు తెలుగుతో పాటు హిందీ మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. హిందీ శాటిలైట్ హక్కుల కోసం పలువురు పోటీ పడగా, చివరికి స్టార్ గోల్డ్ టీవీ పెద్ద మొత్తంలో చెల్లించి ఈ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఒప్పందం ద్వారా ఓజి సినిమాకు ఉన్న క్రేజ్ మరోసారి రుజువైంది.
థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇమ్రాన్ హష్మి విలన్ పాత్రలో కనిపించనున్నాడు. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కొత్త రికార్డులు సృష్టించనుందన్న నమ్మకంతో టీమ్ ముందుకు వెళ్తోంది.
