ఎన్టీఆర్‌, నీల్‌ సినిమా పై క్రేజీ న్యూస్‌..వైరల్‌!

Sunday, December 22, 2024

తెలుగులో కేజీఎఫ్‌ సిరీస్‌ తో బిగ్గెస్ట్‌ విజయాలను అందుకున్న దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. పోయిన సంవత్సరం సలార్‌ సినిమాతో బిగ్గెస్ట్‌ పాన్‌ ఇండియా హిట్‌ ను ఖాతాలో వేసుకున్నాడు. నీల్ తెరకెక్కించిన ఆ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో “సలార్ 2 : శౌర్యంగ పర్వం”సినిమాను తీర్చిదిద్దుతున్నాడు.

 అయితే ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ యంగ్‌ టైగర్‌  ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.అయితే ఆ సినిమా ఎన్టీఆర్‌ 31 వ సినిమాగా తెరకెక్కుతుంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అయితే ఈ  సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని తారక్‌ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా షూటింగ్ సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ క్రేజీ మూవీని ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి దర్శకుడు ప్రశాంత్ సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ 2 మూవీకి సంబంధించిన పనుల్లో  బిజీ గా వున్నారు. ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయిన తరువాత ఎన్టీఆర్ సినిమా సెట్స్ పైకి తీసుకురానున్నట్లు సమాచారం.

అయితే ఎన్టీఆర్ సినిమాను కూడా ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయాలి.ఇప్పటికే ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా రెండు పార్ట్స్ గా తెరకెక్కుత్తుంది.మొదటి పార్ట్ అక్టోబర్ 10 న దసరా కానుకగా రిలీజ్ కానుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles