ఓటీటీలోకి కూలీ..!

Friday, December 5, 2025

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “కూలీ”పై ప్రేక్షకుల్లో ప్రారంభం నుంచి పెద్ద అంచనాలే ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో అమీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ సాహిర్, నాగార్జున లాంటి స్టార్ నటులు కూడా కీలక పాత్రల్లో కనిపించారు. ఈ కారణంగానే సినిమా రీలీజ్ కు ముందే బజ్ మరింత పెరిగింది.

థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత టాక్ మిక్స్ అయినప్పటికీ, కలెక్షన్స్ పరంగా మాత్రం సినిమా మంచి రికార్డులు సృష్టించింది. భారీ ఓపెనింగ్స్ తో మొదలైన ఈ చిత్రం కొంత కాలం పాటు సాలిడ్ రన్‌ని కొనసాగించింది. ఇప్పుడు థియేటర్ల రన్ పూర్తి చేసుకుని, ప్రేక్షకులను ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో అలరించేందుకు వచ్చేసింది.

ఈ సినిమా డిజిటల్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో చేతిలోకి వెళ్లాయి. ప్రస్తుతం తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles