“గేమ్ ఛేంజర్” టీజర్ లో ఫిర్యాదులు..!

Tuesday, January 21, 2025

మెగా పవర్ స్టార్‌ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా ఇండియన్ కేమరూన్ శంకర్ తెరకెక్కించిన మోస్ట్‌ అవైటెడ్ చిత్రమే “గేమ్ ఛేంజర్” గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి రీసెంట్ గానే లాంగ్ అవైటెడ్ టీజర్ ని మేకర్స్ రిలీజ్ కి తీసుకొచ్చారు. అయితే ఈ టీజర్ వచ్చాక భారీ రెస్పాన్స్ నమోదు అయ్యింది కానీ టీజర్ విషయంలో కొన్ని కంప్లైంట్స్ కూడా లేకపోలేవు.

ముఖ్యంగా సంగీత దర్శకుడు థమన్ ఇచ్చిన మ్యూజిక్‌ స్కోర్ కొంతమేర ఓకే కానీ కొంతమేర మాత్రం ఆల్రెడీ ఎక్కడో విన్నట్టే ఉందని చాలా కామెంట్లు వినిపడ్డాయి. దీనితో సినిమాలో మాత్రం ఒక ఫ్రెష్ స్కోర్ కావాలంటూ అభిమానులు అడుగుతున్నారు. అలాగే కొన్ని సీన్స్ లో గ్రాఫిక్స్ కూడా క్లియర్ గా తెలిసిపోతుంది.

చరణ్ ఓల్డ్ గెటప్ లో నడుచుకుంటూ వచ్చే సీన్ లో అయితే ఇంకా తెలుస్తుంది. దీంతో ఆ మ్యూజిక్ అండ్ విజువల్ ఎఫెక్ట్ పరంగా మేకర్స్ మరింత కేర్ తీసుకోవాలని చరణ్ అండ్ మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే గతంలో థమన్ పలు సినిమాలకి టీజర్ లో ఒక్క స్కోర్ ఇచ్చినప్పటికీ తర్వాత సినిమాలో టోటల్ మార్చేశాడు. మరి ఈ సినిమాకి కూడా అలా మారిస్తే బెటర్ అని చెప్పొచ్చు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles