ఒక్కసారి కమిట్‌ అయితే!

Monday, March 31, 2025

ప్రస్తుతం గ్లోబల్ లెవెల్లో భారీ అంచనాలు ఉన్న టాలీవుడ్ సహా ఇండియన్ సినిమా నుంచి ఉన్న ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది గ్యారంటీగా సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి ప్రాజెక్ట్ అనే చెప్పుకోవాలి. మరిన్ని అంచనాలు సెట్ చేసుకున్న ఈ మూవీ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగాఎదురు చూస్తుండగా ఫైనల్ గా సింహాన్ని పట్టేసాను అంటూ చేసిన ఈవిల్ పోస్ట్ ఒక్కసారిగా మంచి వైరల్ గా మారిపోయింది.

దానికి సూపర్ స్టార్ మహేష్ పెట్టిన రిప్లై కూడా మంచి క్రేజీగా వైరల్ అవుతుంది. జక్కన్నకి ధీటుగానే నేను కూడా రెడీ అన్నట్టుగా తన సెన్సేషనల్ డైలాగ్ పోకిరి మూవీ నుంచి “ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను” అంటూ వేరే లెవల్‌ లో రిప్లై ఇచ్చారు. దీంతో తన పోస్ట్ మరింత ఎగ్జైట్మెంట్ ని పెంచింది అని తెలుస్తుంది. మరి ఈ ఇద్దరి భారీ కాంబో ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles