న్యాచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై తెరకెక్కిన మూవీ ‘కోర్ట్’- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు ఓటీటీ అరంగేట్రం కోసం ఈ సినిమా రెడీగా ఉంది. ఏప్రిల్ 11న, 2025 నుండి కోర్ట్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కాబోతుంది. నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా కోర్ట్ ప్రీమియర్ తేదీని ప్రకటించింది. అయితే, ఇతర భాషలలో డబ్బింగ్ వెర్షన్‌లకు సంబంధించిన స్ట్రీమింగ్ డేట్స్ ను మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
అన్నట్టు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 57 కోట్లు వసూలు చేసి పెద్ద విజయాన్ని సాధించింది. పైగా ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల్లోనే.. అత్యంత లాభదాయక చిత్రంగా ఈ సినిమా నిలబడటం మరో విశేషం. మొత్తమ్మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సాలిడ్ కలెక్షన్స్ అందుకుంటుంది. ఈ సినిమాలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్, రోహిణి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు.