వచ్చార్రోయ్‌..వచ్చార్రోయ్‌!

Thursday, March 20, 2025

వచ్చార్రోయ్‌..వచ్చార్రోయ్‌! టాలీవుడ్ యువతని ఎంతగానో మెప్పించిన సాలిడ్ హిట్ చిత్రాల్లో యంగ్ హీరోలు నార్నె నితిన్, సంగీత్ శోభన్ అలాగే రామ్ నితిన్ ల కలయికలో దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన సాలిడ్ హిట్ చిత్రం “మ్యాడ్” కూడా ఒకటి. మరి ఈ చిత్రానికి ఇపుడు సీక్వెల్ ని కూడా తీసుకొస్తున్నారు.

మ్యాడ్ స్క్వేర్ అంటూ వస్తున్న ఈ సినిమా నుంచి కూడా పలు సాంగ్స్ సూపర్ హిట్ కాగా మేకర్స్ ఇపుడు ముగ్గురు ఫ్రెండ్స్ పై సాలిడ్ మాస్ నెంబర్ ని రిలీజ్ చేశారు. వచ్చార్రోయ్ అంటూ సాగే ఈ పాటని జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్ కేవీ అందించడం విశేషం కాగా ముగ్గురిపై తన లిరిక్స్ మాత్రం అదిరిపోయాయి అని చెప్పాలి.

ఇక దీనికి భీమ్స్ సంగీతం కూడా అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు. ఇలా ఈ ముగ్గురు యంగ్ హీరోలు మళ్ళీ ఆడియెన్స్ ని ఎంటెర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ మార్చ్ 28న సినిమా రిలీజ్ కి రాబోతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles