రా రాజా..అంటున్న ఓ కొత్త సబ్జెక్ట్‌!

Wednesday, April 2, 2025

ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద రాని ఓ కొత్త సబ్జెక్ట్, ఎవ్వరూ టచ్ చేయని ఓ ప్రయోగంతో వస్తున్నా లేటెస్ట్ సినిమానే “రా రాజా”. మొహాలు కనిపించుకుండా ఓ ట్రైలర్‌ను కట్ చేయడం అన్నది ఎలాంటి టెక్నీషియన్‌కు అయినా కష్టమే. అలాంటి ఓ విభిన్న ప్రయోగాన్ని ‘రా రాజా’ టీం చేసింది. శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద బి.శివ ప్రసాద్ దర్శకత్వంలో ‘రా రాజా’ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి బూర్లే హరి ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, కిట్టు లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్‌ను వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఇక ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ జనాల్లో మరింత క్యూరియాసిటీని పెంచేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను చిత్రయూనిట్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఈ మూవీ విడుదలకు సిద్దంగా ఉంది. ఇక త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్లు అనౌన్స్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles