హాట్ బ్యూటీ ముమైత్ ఖాన్ తెలుగులో ఒకప్పుడు ఫుల్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఐతే, తాజాగా ముమైత్ ఖాన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్య సమస్యల గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓ టాక్ షోలో ముమైత్ ఖాన్ మాట్లాడుతూ.. ‘ఇంట్లో నేను డ్యాన్స్ చేస్తుండగా కాలు స్లిప్ అయి పడిపోయాను. ఆ సమయంలో నాకు మెదడులో నరాలు కూడా కట్ అయినట్లు తెలిసింది. నేను పడిపోయిన పొజిషన్ ను బట్టి, నా నరాలు కట్ అయ్యాయి’ అంటూ ముమైత్ ఖాన్ చెప్పింది.
ముమైత్ ఖాన్ ఇంకా మాట్లాడుతూ.. ‘నేను పడిపోయాక, 15 రోజులు కోమాలో ఉన్నాను. సర్జరీ తర్వాత కొంత మెమొరీ కూడా లాస్ అయ్యాను. ఇప్పటికీ నా బ్రెయిన్‌లో 9 వైర్లు ఉన్నాయి. నా గ్లామర్ అంతా పాడైపోయింది. ఇండస్ట్రీలో చాలా అవకాశాలు కోల్పోయాను. ఆ ప్రమాదం నన్ను ఎంతగానో బాధ పెట్టింది. ఒకవిధంగా నా లైఫ్ ను ఆ ప్రమాదం పూర్తిగా మార్చేసింది’ అంటూ ముమైత్ ఖాన్ తెలిపారు.
