నేడు ఓ క్లారిటీ రానుంది!

Sunday, December 22, 2024

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న ‘పుష్ప 2 ది రూల్’ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ అప్ డేట్ పై ఓ వివరణ అయితే రాబోతుంది. ‘పుష్ప 2’ ట్రైలర్‌ రిలీజ్ గురించి ఈ రోజు రివీల్ చేయబోతున్నారు.

 కాగా ‘పుష్ప 2’ కొత్త పోస్టర్‌తో పాటు ట్రైలర్ విడుదల తేదీని కూడా ఈ రోజు అధికారికంగా వెల్లడించనున్నారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ అప్ డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక  హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ పాన్ ఇండియన్ రేంజ్ లో గ్రాండ్ గా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ తో పాటు తమన్ కూడా సంగీతం అందిస్తున్నట్లు సమాచారం.

అన్నట్టు శ్రీలీల, సునీల్, ఫహాద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్ మరియు బ్రహ్మాజీ వంటి తారాగణం ఈ సినిమాలో నటించింది. కాగా ఈ డిసెంబర్ 5న సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. .

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles