కన్నడ సినిమా దగ్గర సెన్సేషనల్ హిట్ అయ్యిన పలు చిత్రాల్లో కొన్నేళ్ల కితం వచ్చిన సెన్సేషనల్ డివోషనల్ హిట్ చిత్రం “కాంతార” కూడా ఒకటి. నటుడు రైశ్శబ్ శెట్టి హీరో తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ భారీ హిట్ కి ప్రీక్వెల్ ని అనౌన్స్ చేసి భారీ హంగులతో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇపుడు శరవేగంగా జరుగుతుండగా ఈ సినిమా రిలీజ్ పై పలు పుకార్లు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి.
ఈ సినిమాని మేకర్స్ ఈ అక్టోబర్ 1న పాన్ ఇండియా లెవెల్లో లాక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ డేట్ లో సినిమా రాదు అని కొన్ని రూమర్స్ వైరల్ అవుతుండగా మేకర్స్ దీనికి చెక్ పెట్టారు. సినిమా అనుకున్నట్టే ఆన్ టైం వచ్చి తీరుతుంది అని కన్ఫర్మ్ చేశారు. దీనితో ఈ అవైటెడ్ ప్రీక్వెల్ సినిమాపై క్లారిటీ వచ్చేసినట్టే అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.