తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ కొత్త ప్రతిభకు అవకాశం ఇస్తూ వారిని ముందుకు తీసుకువెళ్లడంలో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ తరహాలోనే యువ హీరో పవన్ తన మొదటి సినిమా చిన్ని చిన్ని ఆశలు నాలో రేగినే తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించిన పవన్, తర్వాత వరుసగా సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నాడు.
యువ నటుడు పవన్ సినీ ప్రయాణం మొదలై తక్కువ కాలమే అయినా ఆయనకి ఇప్పటికే పలు గౌరవాలు దక్కాయి. చిన్ని చిన్ని ఆశలు నాలో రేగినే సినిమాకి బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు. అలాగే సమాజ సేవలో చేసిన కృషిని గుర్తించి ఒక విశ్వవిద్యాలయం ఆయనకి గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. కళారంగంలో చూపిస్తున్న నిబద్ధతకు మరో ప్రత్యేక గౌరవం కూడా లభించింది. ఈ అవార్డులు పవన్‌కి మరింత ఉత్తేజాన్ని ఇచ్చాయని చెబుతున్నారు.
ఇప్పటి వరకు పవన్ నటించిన సినిమాల్లో మిస్టర్ కింగ్, ను రౌద్ర రూపాయ నమః, అప్పుడలా ఇప్పుడిలా, మేడారం జాతర, ఎలా, బ్రహ్మాండ, ఒసేయ్ రాములమ్మ, సువర్ణ, చిన్ని చిన్ని ఆశలు నాలో రేగినే, కాలేజ్ పోరగాళ్లు, యువ నాయకుడు, మనసంతా నువ్వే పవన్ (న్యూ), ఇదేనా ప్రేమంటే వంటి చిత్రాలు ఉన్నాయి.
ఇక రాబోయే రోజుల్లో ఆయన నటించిన సేన, TS09, టెంపుల్ రన్, విశ్వ కర్ణ సినిమాలు రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాలు పవన్ కెరీర్‌లో కీలకమైన మలుపుగా మారుతాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.
