జక్కన్నతో చర్చలు నిజమే అంటున్న చియాన్‌..కానీ!

Sunday, December 22, 2024

త‌మిళ స్టార్ హీరో చియాన్ విక్ర‌మ్ న‌టించిన తాజా సినిమా ‘తంగ‌లాన్’ ఆగ‌స్టు 15న భారీ విడుదలకు రెడీ అయ్యింది. ఈ సినిమాలో విక్ర‌మ్ స‌రికొత్త గెట‌ప్ తో కనిపిస్తుండ‌టంతో ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇక ఈ సినిమాను అటు త‌మిళ్ తో పాటు తెలుగులోనూ
ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల కాబోతుంది. ఈ క్ర‌మంలో ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ ను స్టార్ట్ చేసింది చిత్ర బృందం.

ఇందులో భాగంగా తంగ‌లాన్ టీమ్‌  మీడియాతో ముచ్చ‌టించారు. ఈ క్ర‌మంలో టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్.రాజ‌మౌళి విక్ర‌మ్ తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని.. మ‌హేష్ బాబు న‌టించ‌బోయే సినిమాలో విక్ర‌మ్ న‌టిస్తున్నారా..? అని ఓ విలేక‌రి అడిగారు దీనికి స‌మాధానంగా విక్ర‌మ్ మాట్లాడుతూ.. రాజ‌మౌళితో చ‌ర్చ‌లు వాస్త‌వ‌మే అని.. అయితే మ‌హేష్ బాబు సినిమాలో న‌టిస్తుండ‌టం అనేది మాత్రం నిజం కాదని ఆయన చెప్పుకొచ్చాడు.

కానీ, రాజ‌మౌళితో కచ్చితంగా సినిమా చేస్తాన‌ని విక్ర‌మ్ చెప్పుకొచ్చాడు. దీంతో రాజ‌మౌళితో విక్ర‌మ్ చేయ‌బోయే సినిమాపై సినీ వర్గాల్లో పెద్ద చర్చే  నడుస్తుంది.మ‌రి మహేష్ బాబు – రాజ‌మౌళి సినిమాలో కాకుండా విక్ర‌మ్ ఏ సినిమాలో న‌టిస్తాడా అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆస‌క్తిక‌రంగా మారింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles