మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ప్రపంచం నలుమూలల నుంచి సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక రోజున మెగాస్టార్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ “విశ్వంభర” టీజర్ రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ కి మరింత ఆనందం కలిగింది. గతంలో రిలీజ్ చేసిన ట్రోల్ గ్లింప్స్ కాస్త మిశ్రమ స్పందన తెచ్చుకున్నా, ఈసారి వచ్చిన టీజర్ మాత్రం ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తూ బజ్ క్రియేట్ చేసింది.
ఈ టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ లో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తెలుగు కంటే హిందీ వెర్షన్ కి ఎక్కువ వ్యూస్ రావడం. నిన్న సాయంత్రం విడుదలైన టీజర్, 12 గంటల్లోనే తెలుగులో సుమారు 2.2 మిలియన్ వ్యూస్ అందుకోగా, హిందీలో మాత్రం కేవలం 11 గంటల్లోనే 3.2 మిలియన్ వ్యూస్ దాటేసింది. ఈ ట్రెండ్ చూస్తుంటే ఉత్తర భారత ప్రేక్షకుల్లో కూడా విశ్వంభర పై మంచి ఆసక్తి నెలకొన్నట్టు స్పష్టమవుతోంది.
