ఒకే వేదిక పై చిరు-బాలయ్య బాబు!

Tuesday, January 21, 2025

నందమూరి నటసింహం బాలయ్య బాబూ ఇప్పటికీ సోలోగా సినిమాలు తీస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. బాలయ్య బాబు తాతమ్మ కల సినిమాతో 1974లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి  కెరీర్‌ ప్రారంభించారు. ఆయన నేటికీ అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్నారు

తాజాగా ఆయన సినీ పరిశ్రమలో నటుడిగా 50 ఏళ్లు పూర్తిచేసుకోవడంతో అటు సినీ పరిశ్రమ పెద్దలు, ఇటు అభిమానులు ప్రత్యేక వేడుకలు నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ సెప్టెంబర్ 1న బాలయ్య 50 సంవత్సరాల స్వర్ణోత్సవాన్ని నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన  కర్టెన్ రైజర్ ని ఫిలిం ఛాంబర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ సోదరులు నందమూరి రామకృష్ణ, నందమూరి మోహనకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను, వైవిఎస్ చౌదరి, పలువురు నిర్మాతలు, సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

కాగా, సెప్టెంబర్ 1న ఘనంగా నిర్వహించబోతున్న బాలయ్య గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ కు మొదటి ఆహ్వాన పత్రికను మెగాస్టార్ చిరంజీవికి అందించారు.  ఈ వేడుకలు HICC నోవాటెల్ లో జరగనున్నాయి. 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో 109 సినిమాలతో అలరించారు. తన నటనతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు నందమూరి బాలయ్య బాబు.  ఆదిత్య 369, భైరవద్విపం వంటి విభిన్న సినిమాల్లో  ఆ పాత్రలకే ప్రాణం పోసాడు బాలయ్య.

ఇటీవల అఖండ, వీర నరసింహ రెడ్డి సినిమాలతో భారీ విజయాలు అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ముందుకు దూసుకుపోతున్నాడు. అటు సామాజిక సేవలోనూ ఎప్పుడు ముందుటారు బాలకృష్ణ. ‘బసవతారకం’ హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తూ, తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ నటుడిగానే కాకుండా రాజకీయాల్లో కూడా సత్తా చాటుతున్నారు నందమూరి బాలయ్య బాబు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles