చిరు 157 స్టోరీ రెడీ..డైరెక్టర్ ఎవరో తెలుసా!

Wednesday, December 18, 2024

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం  ‘విశ్వంభ‌ర’ సినిమాతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. బింబిసారతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ వశిష్ట చిరు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ కు జోడిగా అందాల భామ త్రిష నటిస్తోంది. ఈ సినిమా సోషియో ఫాంటసీ నేపథ్యంలో
తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

 ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. MM కీరవాణి ఇటీవలే మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ చిత్రంపై అభిమానుల్లో  మరిన్ని అంచనాలు పెంచింది. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు నిర్మాతలు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ చివరి దశలో ఉండగా చిరు తర్వాత ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టేశారు.

చిరు కెరీర్ లో 157వ చిత్రంగా రానుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చెన్నై లో శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. రచయిత కమ్ డైరెక్టర్ బీవీఎస్ రవి ఈ మూవీకి కథా సహకారం అందించనున్నట్లు సమాచారం.మెగాస్టార్ తో గాడ్ ఫాదర్  చిత్రానికి దర్శకత్వం బాధ్యతలు వహించిన తమిళ దర్శకుడు మోహన రాజా చిరు 157వ చిత్రానికి కూడా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.

మెగాస్టార్ ఈ సినిమా లో పెళ్లి అయిన మధ్య వయస్కుడి గా కనిపిస్తారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. చిరు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ లో రానున్న ఈ చిత్రాన్ని మెగాస్టార్ పెద్ద కుమార్తె  కొణెదల సుస్మిత నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని అధికారకంగా ప్రకటించనున్నారు మూవీ మేకర్స్. ఈ ఏడాదిలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో  ఈ సినిమాని థియేటర్లలోకి తీసుకుని వచ్చేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles