మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న కొన్ని సినిమాలు పూర్తయ్యే దశలో ఉన్నాయి. వాటి రిలీజ్ కి కూడా ఎక్కువ సమయం లేదు. ఈ ప్రాజెక్టుల తర్వాత ఆయన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్టు ఫిక్స్ అయ్యింది. అంతేకాకుండా, వాల్తేరు వీరయ్యని హిట్ ఇచ్చిన బాబీతో కూడా మరో ప్రాజెక్ట్ కుదిరిందని టాక్ ఉంది.
ఇక బాబీ – చిరు కాంబినేషన్ గురించి వస్తే, ఈసారి మాత్రం వాల్తేరు వీరయ్య లాంటి మాస్ ఎంటర్టైనర్ కాకుండా, మెగాస్టార్ వయసుకి తగ్గట్టుగా ఒక యాక్షన్ డ్రామా తెరకెక్కించాలనుకుంటున్నాడని సమాచారం. దీనిలో గ్యాంగ్ స్టర్ షేడ్ లో చిరంజీవిని చూపించడానికి బాబీ ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ఇటీవల డాకు మహారాజ్ తో బాబీకి మంచి గుర్తింపు వచ్చింది కాబట్టి, మెగాస్టార్ కోసం మరింత గ్రాండ్ గా ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు.
ఈ క్రేజీ కాంబినేషన్ పై ఫ్యాన్స్ లో ఇప్పటికే హైప్ మొదలైంది.
