పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా సుజీత్ దర్శకత్వం వహిస్తున్న భారీ ప్రాజెక్ట్ “ఓజి” కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై మొదటి రోజు నుంచే భారీ హైప్ నెలకొని ఉంది. ఫ్యాన్స్ కోసం సుజీత్ ప్రత్యేకంగా ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించారని తెలుస్తోంది.
ఇక తాజాగా ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి స్పందించడం చిత్ర బృందానికి, అభిమానులకు మంచి ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. పవన్ కళ్యాణ్ ని అందరూ ఓజస్ గంభీరంగా చూస్తూ సెలబ్రేట్ చేయడం చాలా సంతోషంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే సుజీత్ దిశా నిర్దేశం, నిర్మాత దానయ్య కృషి, థమన్ అందించిన మ్యూజిక్ పై ప్రశంసలు కురిపించారు. నటీనటులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
