చెర్రీ మూవీస్‌ లోనే స్పెషల్‌ అంట!

Friday, December 5, 2025

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాపై ఇప్పటికే భారీ క్రేజ్ నెలకొంది. ఈ చిత్రం చరణ్ కెరీర్‌లో చాలా ప్రత్యేకంగా నిలుస్తుందని సినిమా యూనిట్ చెబుతోంది. ఇప్పటివరకు ఆయన చేసిన చిత్రాలతో పోలిస్తే, ఈ కథలో ఆయన పాత్ర మరింత విభిన్నంగా ఉంటుందట. ముఖ్యంగా రెండో భాగంలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు, చరణ్ యాక్షన్ స్టైల్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని సమాచారం.

ఈ సినిమా కథనంలో హీరో క్యారెక్టర్‌కు మూడు వేర్వేరు కోణాలు ఉన్నాయని అంటున్నారు. దీంతో చరణ్ కొత్త తరహా లుక్‌తో అభిమానులను ఆశ్చర్యపరచబోతున్నారని చెప్పుకుంటున్నారు. రాబోయే ఏడాది మార్చి 27న ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles