గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, జాన్వీ కపూర్ హీరోయిన్ గా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న “పెద్ది” సినిమా మీద మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఇది పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. రామ్ చరణ్ ఈ సినిమా కోసం పూర్తిగా కొత్త లుక్ తో కనిపించనున్నాడని తెలిసిందే. ఆ మాస్ గెటప్ లోనే కాకుండా క్లాస్ లుక్స్ లో కూడా ఆయన చుట్టూ చర్చలు మొదలయ్యాయి.
ఇప్పటికే రామ్ చరణ్ విదేశీ టూర్లో ఉన్నప్పుడు తీసుకున్న కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. వాటిలో ఆయన సూట్ వేసుకుని కనిపించిన రీతీ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోగ్రాఫర్ ఆరిఫ్ మినాజ్ స్టైలిష్ లుక్ ను కప్‍చర్ చేశారు. ఈ ఫోటోలు ఇప్పుడు విపరీతంగా షేర్ అవుతున్నాయి.
ఈ కొత్త లుక్స్ చూసిన అభిమానులు ఆయనను మరోసారి ఒక పవర్‌ఫుల్ యాక్షన్ మూవీలో చూడాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగ లాంటి యాక్షన్ దర్శకుని హ్యాండిల్ చేస్తే అదిరిపోతుందని కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి “పెద్ది” సినిమాకు సంబంధించి రామ్ చరణ్ లేటెస్ట్ లుక్స్ ఇప్పుడు అభిమానుల్లో జోష్ పెంచుతున్నాయి.
