టాలీవుడ్ కి చెందిన క్రియేటివ్ ఫిల్మ్ మేకర్స్ లో ప్రశాంత్ వర్మ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తక్కువ సినిమాలతోనే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు క్రియేట్ చేస్తున్న సినిమాటిక్ యూనివర్స్ పై ప్రేక్షకుల్లో మంచి బజ్ ఉంది. ఆ యూనివర్స్ లో భాగంగా వస్తున్న లేడీ సూపర్ హీరో ప్రాజెక్ట్ “మహాకాళి”కి ఇప్పటికే మంచి అటెన్షన్ దక్కుతోంది.
ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ అక్షయే ఖన్నా కీలక పాత్రలో నటిస్తున్నారు. గతంలో వచ్చిన హిందీ బ్లాక్‌బస్టర్ “ఛావా”లో ఔరంగజేబ్‌గా చేసిన అతని నటన ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు “మహాకాళి”లో కూడా ఆయన కొత్త షేడ్స్‌లో కనిపించబోతున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో అక్షయే పూర్తి భిన్నమైన లుక్ తో దర్శనమివ్వగా, అది హిందీ ఆడియెన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులలో కూడా ఆసక్తిని రేపింది.
ఈ సినిమాలో ఆయన అసురులకు గురువుగా భావించే శుక్రాచార్యుడి పాత్రలో కనిపించనున్నారని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇంతకు ముందు ప్రశాంత్ వర్మ తీసిన “మహావతార్ నరసింహ”లో హిరణ్యాక్ష సోదరులకు గురువుగా యానిమేటెడ్ వెర్షన్‌లో శుక్రాచార్యుడిని చూపించిన విషయం గుర్తుండే ఉంటుంది. కానీ ఈసారి లైవ్ యాక్షన్ లో అక్షయే ఖన్నాతో ఆ పాత్రను చూపించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
