టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటిగా నిలుస్తున్న అఖండ 2 నుంచి తాజాగా మేకర్స్ ఒక మాస్ అప్డేట్ ని ఇచ్చారు. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం తొలి భాగం అఖండకి సీక్వెల్ గా రూపొందుతోంది. ఇప్పటికే అభిమానుల్లో మంచి అంచనాలు ఉండగా, ఇప్పుడు విడుదలైన టీజర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది.
టీజర్ లో బాలయ్య అఘోరా గెటప్ లో మళ్లీ కనిపించి అభిమానులకు పండుగను తెచ్చారు. శివుడి అనుమతి లేకుండా ఎవరూ ప్రాణాలు తీయలేరు అనే విధంగా కథలోని డైలాగ్స్ విలన్లపై గట్టిగా వేసారు. అఖండ పాత్రలో బాలయ్య పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.
ఇక థమన్ ఇచ్చిన నేపథ్య సంగీతం టీజర్ కి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రతి ఫ్రేమ్ లో కూడా బోయపాటి మాస్ టచ్ కనిపిస్తూ, ఈ సినిమా మరోసారి థియేటర్లలో అఖండ తాండవాన్ని చూపించబోతోందని క్లారిటీ ఇచ్చింది. గతంలో వీరి కాంబినేషన్ ఎంతగా వర్కౌట్ అయిందో గుర్తు చేసుకుంటే, ఈసారి కూడా అదే రేంజ్ లో అంచనాలు పెట్టుకోవచ్చు.
సంక్రాంతి దగ్గరగా వస్తుండడంతో మళ్లీ మాస్ ఫెస్టివల్ మూడ్ తీసుకురావడంలో ఈ సినిమా కీలకంగా మారనుంది. టీజర్ చూసినవాళ్లంతా ఒక్కసారి అఖండ మేనియా మళ్లీ స్టార్ట్ అయ్యిందనే ఫీలింగ్ తో ఉన్నారు.
