వైరల్ అవుతున్న చరణ్‌ కామెంట్స్‌!

Andhrawatch
1 Min Read

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్‌ ఆర్‌  సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. ఆ సినిమాకి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ఇప్పుడు అందరి దృష్టి కూడా రామ్ చరణ్ చేస్తున్న తదుపరి చిత్రాలపై ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ చిత్రం షూటింగ్ అయిపోయింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రం కోసం రెడీ అవుతున్నాడు చరణ్.

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో చరణ్ చేసిన కామెంట్స్ ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారాయి. తనకు యాక్షన్ ఎంటర్టైనర్ లు ఇష్టమని చెప్పిన చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో కామెడీ చిత్రం చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు కామెడీ జోనర్ టచ్ చేయని చరణ్, ఇలాంటి కామెంట్స్ తో బుచ్చిబాబు తో సినిమా ఎలా ఉండబోతుంది అనే దానిపై ఆసక్తి ఏర్పడింది.

మరొక పక్క బుచ్చిబాబు మాత్రం సినిమా రా అండ్ రస్టిక్ గా ఉంటుంది అని ఇప్పటికే చాలా సార్లు చెప్పుకొచ్చాడు. ఆస్కార్ అవార్డు విన్నర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు మూవీ టీమ్‌ తెలిపింది.

Share This Article