గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ఎంతగా ఆశలు పెంచిందో అందరికీ తెలిసిందే. కానీ సినిమాకి కలిసొచ్చే ఫలితం మాత్రం రాలేదు. భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా కథ, ఫీల్ అంతగా కనెక్ట్ కావడం లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో నిలబడలేకపోయింది.
అయితే ఈ ఫలితానికి భిన్నంగా, దిల్ రాజు మాత్రం రామ్ చరణ్ పై తన నమ్మకాన్ని అలాగే కొనసాగిస్తున్నట్టున్నారు. ఈ మధ్య జరిగిన తమ్ముడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు ఇచ్చిన హింట్ చూస్తే, రామ్ చరణ్ తో మరోసారి సినిమా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే తన బ్యానర్ లో ఆయనతో మరో ప్రాజెక్ట్ మొదలవుతుందని కూడా చెప్పారు.
ఇప్పటికే ఆ దిశగా చర్చలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ – దిల్ రాజు కాంబినేషన్ లో ఇప్పుడు మరో సారి భారీ సినిమా రానుందన్న ఉత్సాహం ఫ్యాన్స్ లో కనిపిస్తోంది. గత ఫలితం ఎలా ఉన్నా, ఈసారి వీరిద్దరూ కలిసి మంచి కథతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేయబోతున్నారనే అంచనాలు మొదలయ్యాయి.
