గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ సినిమా ప్రస్తుతం మైసూరులో షూటింగ్ జరుపుకుంటోంది. రూరల్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో చరణ్ పూర్తిగా మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్‌లతో ఈ సినిమా మీద మంచి హైప్ క్రియేట్ అయ్యింది.
ఇక తాజాగా చరణ్ ఎంట్రీ కోసం ఒక భారీ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. జానీ మాస్టర్ డాన్స్ కంపోజిషన్‌లో సాగుతున్న ఈ పాటలో సుమారు వెయ్యి మంది డాన్సర్లు పాల్గొంటున్నారని సమాచారం. ఈ సాంగ్ షూట్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభమైంది.
అయితే, షూట్ మధ్యలో చరణ్ బ్రేక్ తీసుకున్నాడు. కారణం ఆయన అమ్మమ్మ, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నం శనివారం మృతి చెందడం. ఈ వార్త తెలిసిన వెంటనే రామ్ చరణ్ తక్షణమే హైదరాబాద్ చేరుకున్నాడు. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ముంబై నుంచి వచ్చి కుటుంబ సభ్యులతో ఉండిపోయాడు.
