చరణ్, సుకుమార్ భారీ ప్రాజెక్ట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో చేస్తున్న భారీ సినిమా కోసం అందరికీ తెలిసిందే. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ 16వ సినిమాగా కాగా గేమ్ ఛేంజర్ లాంటి సినిమా ఉన్నప్పటికీ దీనిపై భారీ హైప్ నెలకొంది. అయితే ఈ చిత్రం తర్వాత చరణ్ నుంచి దర్శకుడు సుకుమార్ తో తన కెరీర్ 17వ సినిమా ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై కూడా అనేక అంచనాలు నెలకొనగా ఇపుడు ఈ సినిమాపై సాలిడ్ న్యూస్ బయటకి వచ్చింది. ఈ చిత్రంని సుకుమార్ పక్కా యాక్షన్ ప్యాకెడ్ జానర్లో తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో మరో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ గా చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడని టాక్. మరి ఇందులో ఎంత నిజం ఉందో వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ చిత్రానికి కూడా దేవిశ్రీ ప్రసాద్ నే సంగీతం అందించనుండగా తమ రంగస్థలం నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ వారే నిర్మాణం వహించనున్నారు.