సినిమా ప్లాప్‌ అయితే పార్టీ చేసుకుంటా అంటున్న చరణ్‌!

Saturday, January 18, 2025

టాలీవుడ్‌ కి మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్‌ చరణ్‌ హీరోగా తనకంటూ సెపరేట్‌ అభిమానులను సంపాందించుకుని తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. RRR సినిమాతో చరణ్ క్రేజ్ ఎల్లలు దాటేసింది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులను ఆకట్టుకొని గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నఈ మెగా హీరోకి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘మీ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్న క్రమంలో ఏదైనా ఒత్తిడికి లోనయ్యారా?’ అనే ప్రశ్న చరణ్‌ కి ఎదురైంది.

ఈ ప్రశ్నకు చరణ్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ” ఒత్తిడిని ఎలా తీసుకోవాలో నాకు తెలియదు. నా కెరీర్‌ విషయానికే వస్తే సినిమా ఫలితాల గురించి మరీ అంత ఒత్తిడిగా ఏమి తీసుకోను. నిజంగా చెప్పాలంటే ఏదైనా సినిమా మంచి రిజల్ట్ రాలేదంటే దాని నుంచి రిలాక్స్‌ అయ్యేందుకు మంచిగా పార్టీ చేసుకుంటాను. అంతేకాదు ఆర్‌ఆర్‌ఆర్‌ విజయం సాధించినప్పుడు అయితే వారం రోజుల దాకా ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టలేదు. నా కుటుంబంతో కలిసి ఇంట్లోనే ఎంజాయ్‌ చేశాను” అని చెప్పుకొచ్చాడు.

అంతేకాకుండా సక్సెస్‌, ఫెయిల్యూర్‌ల గురించి అంతగా ఆలోచించనని, ఇప్పుడు ఏం చేస్తున్నాననేదే నమ్ముతానని, రేపటి గురించి ఆందోళన చెందను’ అంటూ వివరించాడు. దీంతో చరణ్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం చరణ్‌  ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీతో పాటూ బుచ్చిబాబు తో ఓ సినిమా,  అలాగే లెక్కల మాస్టర్‌ సుకుమార్‌  తో మరో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles