ఆ హీరో కోసం రిస్క్ తీసుకుంటున్న చరణ్‌..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మెగా ఫ్యాన్స్!

Sunday, December 22, 2024

మెగా స్టార్‌ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన నటన, డ్యాన్స్‌ తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్‌ చేసుకున్నాడు చరణ్‌. రెండవ సినిమా మగధీరతోనే తన నటన స్థాయి ఏంటో చూపించుకున్నాడు. రెండు సంవత్సరాల క్రితం చరణ్‌ చేసిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా అయితే ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.

ఈ సినిమాకు ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. దీంతో చరణ్ ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ అయిపోయాడు. తండ్రిని మించిన తనయుడిగా టాలీవుడ్‌ లో  చెరగని ముద్ర వేసుకున్నాడు. ఒక్క సినిమాతోనే చరణ్ ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకుని అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. ప్రస్తుతం చరణ్ టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు.

తొందరలో రామ్ చరణ్, శంకర్ కాంబోలో ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  ఈ క్రమంలో  చరణ్ ఓ రిస్క్ చేయబోతున్నట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయనను ఓ స్టార్ హీరో సినిమాలో గెస్ట్‌ రోల్‌ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తునాయి.  ఆ స్టార్‌ హీరోకి  చరణ్‌కు మధ్య మంచి స్నేహం ఉండటంతో  చరణ్‌ కూడా ఆ రోల్‌ చేసేందుకు ఒప్పుకున్నాడని టాక్. ఇందులో నిజమెంత ఉందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

దీంతో మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అంతలా పాపులారిటీ తెచ్చుకున్నాక గెస్ట్ రోల్‌లో నటిస్తే.. కెరీర్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే చరణ్ నిజంగానే ఆ మూవీలో నటిస్తే.. రిస్క్ తీసుకున్నట్లే అని నెట్టింట చర్చించుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles