గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా సినిమా ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతి కానుకగా మెగా విడుదలకు సిద్దం అవుతుంది. ఈ సినిమాను మార్వెలెస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తుండడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదలకి ముందే, చరణ్ తన తరువాత సినిమాని కూడా మొదలు పెట్టేశాడు.
దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో రామ్ చరణ్ తన కెరీర్‌లోని 16వ చిత్రంలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ తాజాగా మైసూర్ నగరంలో మొదలైంది. ఈ షూటింగ్‌లో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ, కమెడియన్ సత్యలపై కొన్ని సీన్స్ షూట్ చేశారు. అయితే, ఇప్పుడు రామ్ చరణ్ మైసూర్ వదిలేసి భూత్ బంగ్లాకు చేరనున్నట్లు సమాచారం.
హైదరాబాద్‌లోని భూత్ బంగ్లా చాలా పాపులర్. ఇక్కడ చాలా సినిమాలు షూటింగ్ జరుపుకున్నాయి. ఇప్పుడు RC16 కూడా ఇక్కడ షూటింగ్ జరుపుకోబోతుందని తెలుస్తోంది. మరి భూత్ బంగ్లాలో రామ్ చరణ్ సినిమా ఎలాంటి సీన్స్‌ను తీస్తుందా అనే ఆసక్తి అందరిలో ఉంది.