కడప దర్గాలో చరణ్‌!

Wednesday, January 22, 2025

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన తరువాత సినిమా ‘గేమ్ ఛేంజర్’ విడుదల కోసం సిద్దంగా ఉన్నాడు. ఈ సినిమాను దర్శకుడు శంకర్ ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది.

అయితే, ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్న చరణ్ తాజాగా కడపలోని అమీన్ పీర్ దర్గాను సందర్శించికున్నారు. ఆయనతో పాటు దర్శకుడు బుచ్చిబాబు సానా కూడా ఈ పర్యటనలో చరణ్ వెంట ఉన్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్ కడపకు వస్తున్నాడని తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్యలో ఆయన్ను చూసేందుకు వచ్చారు. దీంతో వారిని అదుపుచేసేందుకు పోలీసులు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది.

కడప అమీన్ పీర్ దర్గాకు ప్రత్యేకత ఉండటంతో పలువురు సెలబ్రిటీలు ఇక్కడికి వస్తుంటారు. అయితే, తాజాగా సర్వమత సామరస్యానికి ప్రతీకగా అయ్యప్ప మాల లో ఉన్న చరణ్ ఇక్కడికి రావడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ అవుతుంది. ఇక దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles