పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా. మొదట్లో దర్శకుడు క్రిష్ ఈ సినిమాని ప్రారంభించారు. తొలి హిస్టారికల్ సినిమా అన్న ట్యాగ్‌తో ప్రారంభమైన ఈ భారీ ప్రాజెక్ట్ ఇప్పుడు వివిధ కారణాల వల్ల వివాదాల మధ్య పయనమవుతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఫిల్మ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ సినిమాలో దర్శక బాధ్యతలు ప్రారంభంలో క్రిష్ తీసుకున్నప్పటికీ, తరువాత దశల్లో యువ దర్శకుడు జ్యోతి కృష్ణ రంగంలోకి దిగారు. మొదట్లో క్రిష్ విజన్ మేరకు సినిమాని తెరకెక్కించినట్లు తెలుస్తున్నా, ఇప్పుడు చాలా కీలక సన్నివేశాలను జ్యోతికృష్ణ తన స్టైల్లో మార్చినట్టు సమాచారం. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం, కేవలం మిగిలిన పనిని పూర్తి చేయడం మాత్రమే కాదు, ఆయన ఇప్పటికే తెరకెక్కించిన కొన్ని భాగాల్లో కూడా జ్యోతి కృష్ణ మార్పులు చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఇది అభిమానులను కొంత ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ భారీ పీరియాడిక్ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అన్ని అంచనాల నడుమ ఈ సినిమా జూలై 24న థియేటర్లలో విడుదల కానుంది. పవన్ కొత్త తరహా పాత్రలో కనిపించనున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీగా ఆసక్తి నెలకొంది. గతంలో ఎప్పుడూ చూడని పవర్‌ఫుల్ గెటప్‌తో స్క్రీన్ మీద కనిపించనున్న పవన్ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
