అజిత్ మూవీని దాటేసిన చైతూ మూవీ! ఈ ఫిబ్రవరిలో విడుదలకి వచ్చిన తాజా సినిమాల్లో తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన విడా ముయర్చి అలాగే మన తెలుగు నుంచి యంగ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య నటించిన మూవీ తండేల్ ఒక రోజు వ్యవధిలో వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమాల్లో తాజాగా చైతు సినిమా అజిత్ సినిమాని బుకింగ్స్ పరంగా క్రాస్ చేయడం విశేషం. మరి తండేల్ సినిమాకి శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 2 లక్షల 20 వేలకి పైగా టికెట్స్ బుక్ అయితే అజిత్ లాంటి స్టార్ సినిమాకి షాకింగ్ గా కేవలం లక్ష 50 వేలకి పైగా మాత్రమే బుక్ అయినట్లు తెలుస్తుంది.
దీంతో చైతూ క్రేజీ రికార్డ్ సెట్ చేసాడు అని చెప్పాలి. ఇక శనివారం బుకింగ్స్ కూడ చైతూ సినిమాకి సాలిడ్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ చైతు కెరీర్లో హైయెస్ట్ నెంబర్స్ ఈ సినిమాకి నమోదు అవుతున్నాయి.