చేపల పులుసుతో అదరగొట్టిన చైతూ!

Saturday, January 18, 2025

యువ సామ్రాట్‌ అక్కినేని నాగచైతన్య నటించిన తాజా సినిమా ‘తండేల్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు చందు మొండేటి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతుంది.

ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, పాటలు ఈ మూవీపై అంచనాలను మరింత పెంచాయి. యితే, ఈ సినిమా షూటింగ్ సమయంలో చైతూ ఎలా ఉంటాడనే విషయాన్ని చిత్ర యూనిట్ తాజాగా ఓ వీడియో రూపంలో తెలిపారు. చిత్ర యూనిట్ సభ్యులతో చైతూ ఎంతో కనెక్ట్ అయ్యి ఉంటాడని.. వారి కోసం ఏదైనా చేయడానికి ఆయన రెడీగా ఉంటాడని.. ఈ క్రమంలోనే షూటింగ్ సమయంలో పట్టిన చేపలతో పులుసు పెట్టి మరీ యూనిట్ సభ్యులకు పెట్టాడని ఈ వీడియోలో చూపించారు.

ఇక ఆయన స్వయంగా తన చేతులతో ఈ చేపల పులుసు పెట్టగా, అది ఎంతో రుచికరంగా ఉందని యూనిట్ సభ్యులు చెప్పారు. కాగా ఈ సినిమాలో తండేల్ రాజు అనే పాత్రలో నాగచైతన్య సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇస్తుండగా అందాల భామ సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles