చైతూ సినిమాలోకి లపతా లేడీస్‌ యాక్టర్‌!

Monday, December 8, 2025

అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాపై ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. దర్శకుడు కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సూపర్ నాచురల్ థ్రిల్లర్ జానర్‌లో వస్తోంది. ప్రస్తుతం షూటింగ్ వేగంగా కొనసాగుతుండగా, బాలీవుడ్‌లో సంచలన విజయాన్ని అందుకున్న లాపతా లేడీస్ సినిమాలో నటించిన స్పర్శ్ శ్రీవాస్తవ ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యాడు అని టీమ్ అధికారికంగా ప్రకటించింది.

తన లుక్‌ను కూడా ప్రత్యేకంగా డిజైన్ చేసి రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో ఆయన ఎలా నటిస్తారో అన్నది ఇప్పుడు ప్రేక్షకుల కుతూహలంగా మారింది. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. విరూపాక్ష సినిమాకు నిర్మాణ బాధ్యతలు వహించిన ఆయనే ఈ చిత్రానికి కూడా ప్రొడ్యూసర్. సంగీతం విషయానికి వస్తే విరూపాక్ష, కాంతార సినిమాలకు సంగీతం అందించిన అజనీశ్ లోకనాథ్ ఈ ప్రాజెక్ట్‌కూ మ్యూజిక్ అందిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles