అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తన 24వ చిత్రాన్ని దర్శకుడు కార్తీక్ వర్మ దండుతో చేస్తుండటం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ సినిమా పనుల్లోనుంచి కాస్త విరామం తీసుకున్న చైతూ, తన జీవిత భాగస్వామి శోభిత ధూళిపాళతో కలిసి ఆధ్యాత్మిక సమయాన్ని గడుపుతూ కనిపించారు.
తిరుమలలో వీరిద్దరూ దర్శనానికి వెళ్లిన ఫోటోలు బయటకు రావడంతో అభిమానుల్లో ప్రత్యేక ఆకర్షణగా మారాయి. శ్రీవారి విగ్రహాన్ని చేతిలో పట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్న ఈ జంటను చూసి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
