అమ్మ అనే పిలుస్తా! నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్నతాజా సినిమా “అర్జున్ సన్నాఫ్ వైజయంతి”. నటి, ఎమ్మెల్సీ విజయశాంతి ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో యాక్ట్ చేస్తున్నారు.అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ‘‘తండ్రీకొడుకులు పలు విషయాల్లో గొడవ పడడం చివరకు ఒక్కటవడం చాలా సినిమాల్లో చూశాం.
మా సినిమాలో.. ఎంతో ప్రేమగా ఉండే తల్లీకొడుకులు ఎందుకు దూరం కావాల్సి వచ్చింది? మళ్లీ ఎలా కలుసుకున్నారు? అనేదే కీలకం. ఈ కథలో తల్లి పాత్రలో విజయశాంతి మేడమ్‌నే ఊహించుకున్నాను. నేను ఆమెను విజయశాంతి గారు అని అనను. మనస్ఫూర్తిగా అమ్మ అనే పిలుస్తాను’ అంటూ కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.
ఇదే కార్యక్రమంలో విజయశాంతి మాట్లాడుతూ.. ‘‘సినిమా పరిశ్రమకు కల్యాణ్ బాబు చాలామంది కొత్త దర్శకులను పరిచయం చేశారు. ఈ సినిమా విడుదల తర్వాత ప్రదీప్ (దర్శకుడు)కు మరిన్ని అవకాశాలు రానున్నాయి. ఇక ఈ సినిమాలో కల్యాణ్ రామ్ రాజీపడకుండా నటించారు’’ అని విజయశాంతి అన్నారు.
